Header Banner

ఏపీలో మరో కొత్త జిల్లా ఏర్పాటు.. అక్కడే..! హామీ ఇచ్చిన విధంగానే.. పండగ చేసుకుంటున్న తెలుగు తమ్ముళ్లు!

  Sun Mar 09, 2025 00:17        Politics

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రస్తావన మరోసారి తెరపైకి వచ్చింది. సీఎం నారా చంద్రబాబు నాయుడు కొత్త జిల్లా ఏర్పాటుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో చంద్రబాబు శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. మార్కాపూరాన్ని ప్రత్యేక జిల్లా చేస్తామని స్పష్టం చేశారు. పర్యటనలో భాగంగా మహిళలు, యువతులతో చంద్రబాబు ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఓ యువతి.. మార్కాపురం చుట్టూ 250కి పైగా గ్రామాలు ఉన్నాయని, ఇదే పెద్ద పట్టణమని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో స్పందించిన చంద్రబాబు.. మార్కాపురాన్ని జిల్లా చేస్తానని ఎన్నికల సమయంలోనే చెప్పినట్లు గుర్తు చేశారు. హామీ ఇచ్చిన విధంగానే మార్కాపురాన్ని జిల్లా కేంద్రం చేస్తామని తెలిపారు. అన్ని రకాలుగా మార్కాపురాన్ని అభివృద్ధి చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. మరోవైపు మార్కాపురం పశ్చిమ ప్రాంతంలోని ఐదు నియోజకవర్గాలతో పాటు కందుకూరు, అద్దంకి నియోజకవర్గాలను కలిపి ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు ఇటీవలే జిల్లా మంత్రులు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

 

ఇది కూడా చదవండి: ఎమ్మెల్సీ ఫలితాలతో వైసీపీ నేతల్లో వణుకు! కూట్ర విఫలం.. వైసీపీ వ్యూహం బెడిసికొట్టింది!

 

మంత్రులు డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్ ఇటీవలే దీనిపై వ్యాఖ్యలు చేశారు. తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు నోటి నుంచి ఈ ప్రకటన రావటంతో మార్కాపురం జిల్లా ఏర్పాటయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఇటీవల శాసనమండలిలో ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ జిల్లాల పునర్వవస్థీకరణపై కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం వద్ద జిల్లాల పునర్వవస్థీకరణపైనా, కొత్త జిల్లాల ఏర్పాటుపైనా ఎలాంటి ప్రతిపాదనలు లేవని అనగాని సత్యప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్వవస్థీకరణపై విమర్శలు చేశారు. వైసీపీ హయాంలో మంత్రివర్గ సమావేశంలో కూడా చర్చించకుండా జిల్లాలు ఏర్పాటు చేశారని ఆరోపించారు. వైఎస్ జగన్ తొందరపాటుతో, అశాస్త్రీయంగా జిల్లాల విభజన చేశారని మంత్రి ఆరోపించారు. ప్రజా ప్రతినిధులతో చర్చించకుండా నిర్ణయం తీసుకున్నారని.. ఫలితంగా గందరగోళం ఏర్పడిందని మంత్రి ఆరోపించారు.

 

ఇది కూడా చదవండి: వైసీపీకి మరో భగ్గుమనే షాక్! కొడాలి నానికి బిగుస్తున్న ఉచ్చు.. రంగంలోకి దిగిన ఏపీ పోలీసులు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మాజీ ఎమ్మెల్యే కుటుంబంలో తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో మనవడు మృతి!

 

జగన్ కి షాక్.. జనసేన గూటికి వైసీపీ మాజీ ఎమ్మెల్యే.. వైసీపీకి షాకిస్తూ, వారిని కూడా వెంట తీసుకెళుతున్నారుగా..

 

నన్ను మేడం అని పిలవొద్దు.. నేను మీ భువనమ్మను.! గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమంలో..

 

మంత్రి ప్రసంగంతో సినిమా చూపించారు.. RRR ప్రశంస! నోరు ఎత్తని వైసీపీ.. బుల్లెట్ దిగిందా? లేదా?

 

ఏపీ మహిళలకు ఎగిరి గంతేసే న్యూస్.. ప్రభుత్వ ఆటోలు, ఎలక్ట్రిక్ బైక్‌లు! రాష్ట్రంలోని 8 ప్రధాన నగరాల్లో..

 

బోరుగడ్డ అనిల్‌ పరారీలో సంచలనం.. ఫేక్ సర్టిఫికెట్ డ్రామా వెలుగులోకి! పోలీసుల దర్యాప్తు వేగం!

 

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై బిగ్ అప్డేట్.. ఈ కండిషన్ వర్తిస్తుంది, ఆ ఛాన్స్ లేదు!

 

ట్రంప్ మరో షాకింగ్ నిర్ణయం.. ఆ వీసాపై అమెరికా వెళ్లిన వారంతా.! మళ్లీ లక్ష మంది భారతీయులకు బహిష్కరణ ముప్పు.?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Celebrations